భారతదేశంలో HMPV వైరస్ 4 కేసులు నమోదయ్యాయి | India Reports Four Cases of HMPV Virus
ఏంటో కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త ఉత్సాహం అని అనుకోవడానికి లేకుండా నిండా నాలుగు రోజులు గడవక ముందే పిడుగు లాంటి వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది ఐదేళ్ల క్రితం ఈ సమయంలోనే కదా కోవిడ్ మహమ్మారి మెల్లగా చేరి ఒకేసారి పెరిగి అందరిని భయపెట్టింది ఇప్పుడు మరో ఉపద్రవం తాను ఉన్నానంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది అయితే భయపడాల్సింది ఏమీ లేదని భారత ప్రభుత్వం సందేశాలు ఇస్తూనే జాగ్రత్తగా మాత్రం ఉండమని సావధాన క్రియలను గుర్తు చేస్తోంది ఈ కొత్త వైరస్ పేరు హెచ్ ఎం పివి భారతదేశంలో మొట్టమొదటిగా రెండు కేసులు నమోదయ్యాయి చైనాలో అయితే రోజు
రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్తున్నారు అయితే ఇదేం పాండమిక్ గా మారే అవకాశం లేదని చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంచెం భరోసా ఇస్తుంది చలికాలంలో విజృంభించే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు సాధారణమే అని అయితే కోవిడ్ మహమ్మారిని ప్రపంచం మర్చిపోలేదు కనుక ప్రతి కొత్త ఇబ్బందిని పెద్దగా చూడాల్సిన అవసరం ఉందన్నమాట నిజమే అని వైద్య నిపుణులు జాగ్రత్త చెప్తున్నారు ఇన్ఫ్లమేటరీ అంటే శ్వాస సంబంధితమైన ఉబ్బసం దగ్గు జలుబు జ్వరం వంటి సాధారణ లక్షణాలే ఉంటాయని అలాంటివి ఉన్నాయని అనిపించగానే వైద్యున్ని సంప్రదించమని చెప్తున్నారు అవి
తీవ్రమైతే తీసుకోవాల్సిన చికిత్స ఏదో ఒకటి ఉంటుంది కదా అది వైద్య పరీక్షల ద్వారానే నిర్ధారించబడుతుంది కనుక అజాగ్రత్తగా మాత్రం ఉండకండి అని ప్రజలకు సూచిస్తున్నారు ఇప్పుడు హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎం పివి మన భారతదేశంలో ఇద్దరు చిన్నారులకు సోకింది ప్రస్తుతం ఇద్దరు కోలుకున్నారు ఇద్దరు బెంగళూరులో ఉన్న చిన్నారులే మూడు నెలల పసిపాప బ్రోంకోమా తో హాస్పిటల్ లో చేరింది పరీక్షల నంతరం హెచ్ఎం పివి అని తేలింది ఇప్పుడు కోలుకొని ఇంటికి వెళ్ళింది మరో ఎనిమిది నెలల బాలుడు కూడా బ్రోంకో నిమోనియా తో హాస్పిటల్ కి వచ్చి హెచ్ ఎం
పివి పాజిటివ్ అని తేలిన తర్వాత చికిత్స అందుకున్నాడు ప్రస్తుతం కోలుకున్నాడు అపాయం ఏం లేదని డాక్టర్లు చెప్పారు 2025 జనవరి 3న హెచ్ఎం పివి పాజిటివ్ అని పరీక్షలో తేలిన తర్వాత చికిత్స అందగానే మూడు రోజుల్లో ఆరవ తేదీ ఉదయం కల్లా ఆ బాబు నిలకడగా కోలుకుంటున్నాడని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కేంద్ర ప్రజారోగ్య ప్రజలకు సమాచారం ఇచ్చింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ఎప్పటికప్పుడు who వెలువరిస్తున్న తాజా సమాచారాన్ని అనుసరిస్తూ పరిస్థితులను విశ్లేషించుకుంటుంది భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ దేశంలో తీవ్ర శ్వాస సంబంధ
అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది సర్వర్ అక్యూట్ రెస్పిరేటరీ ఎలయన్స్ ఉన్నవాళ్ళంతా ఇతరులకు కొంచెం దూరంగా ఉండడం దగ్గు తుమ్ము వచ్చినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడం ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండడం కరచాలనం వంటివి చేయకుండా కాస్త ఎడం పాటించడం కాలుష్యం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు చల్లగాలి సోకకుండా జాగ్రత్త పడటం చేయమంటుంది ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలే సుమా ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు అంటుంది మరి అయితే ఇబ్బంది ఏంటంటారా చైనాలో మొదలైన
ఈ HMPV వైరస్ 4 కేసులు వైరస్ వ్యాప్తి చెంది వైరస్ సోకిన వారితో ఇక్కడ హాస్పిటల్ నిండిపోయేలా చేసింది సరిహద్దు దేశాలకు పాకే అవకాశాన్ని కొట్టి పారేయడం లేదు కానీ ఆ దేశంలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంది అయితే భారతదేశంలో కేసులు నమోదు కావడానికి ఆ వైరస్ ఇక్కడి వరకు వ్యాపించడం మాత్రం కారణం కాదంటున్నారు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో ఒక హాస్పిటల్ లో చేరిన ఇద్దరు చిన్నారులు ఎక్కడికో ప్రయాణించలేదని ఖచ్చితంగా తేలింది అంటే సదరు వైరస్ కొన్నేళ్లుగా ఇక్కడ కూడా ఉందని ఇప్పుడు చైనాలో తీవ్రమైన వైరస్ మనకు తెలిసిన హెచ్ ఎం పివి తాలూకు కొత్త వేరియంట్ అవునా కాదా అన్నది ఇంకా
పరీక్షిస్తున్నారని ఐసిఎంఆర్ చెప్తోంది ఈ ఇద్దరు పిల్లల పెద్దవాళ్ళు కూడా ఎలాంటి ప్రయాణాలు చేసి వచ్చి వచ్చిన వాళ్ళు కాదని తెలుస్తోంది కాబట్టి ట్రావెల్ హిస్టరీ లేకుండానే హెచ్ఎం పివి వైరస్ దేశంలో ఉండి ఇప్పుడు కేసులు నమోదయ్యేందుకు సిద్ధంగా ఉండి ఉండొచ్చు తప్ప మహమ్మారిగా భావించి హైరానా పడొద్దని ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తుంది కాబట్టి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తేనే ఇంకెంత మంది హెచ్ఎం పివి బారిన పడిన వారు ఉన్నారు దేశంలో అనేది తెలుస్తుంది మలేషియా జపాన్ హాంగ్కాంగ్ లకు అతి జాగ్రత్తగా ఉండమని who నుంచి సూచనలు అందాయని వార్తలు
వెలువడుతున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆరోగ్య శాఖలు హెల్త్ అలర్ట్ సూచనలను రేడియో టీవీ పత్రికలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందిస్తున్నాయి దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా జాగ్రత్తగా ఉండమని సూచనలు అందిస్తున్నాయి ప్రమాదం ముంచుకొచ్చిన వైద్యం అందుబాటులో ఉండేలా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి శీతాకాలంలో ఇటువంటి ఇన్ఫ్లూయన్జా వైరస్ లు చురుగ్గా తయారై చాలా ఈజీగా అంటుకుంటాయి కనుక ఏ చిన్న లక్షణాన్ని తేలిగ్గా తీసుకోవద్దని
మాత్రం హెచ్చరిస్తున్నారు కోవిడ్ 19 కరోనా వైరస్ ఒక కొత్త వైరస్ వేరియంట్ కనుక చకచక వ్యాపించింది దాన్ని అడ్డుకునే ప్రతినిరోధకాలు అంటే యాంటీబాడీస్ మనుషుల్లో లేకపోవడం వల్ల ప్రపంచమంతా అతల కుతలమైంది అయితే ప్రస్తుతం హెచ్ఎం పివి సంగతి అలా కాదు 2001 లోనే దీన్ని కనుగొన్నారు అయితే దీనికి సరిపడా టీకా మాత్రం ఇంకా తయారు కాలేదు చాలా కాలంగా ఉనికిలో ఉండడం మూలంగా ప్రజల్లో ఇమ్యూనిటీ కూడా పెరిగి ఉంటుంది కాబట్టి ఎప్పటికిప్పుడు క్రింద మీద పడిపోవాల్సిన అవసరం లేదని మనలో తగినంత మోతాదులు నిరోధకత వృద్ధి చెందిందని ఐసిఎంఆర్ వివరిస్తోంది
కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైరస్ కొత్త వేరియంట్ అని నిర్ధారించబడే వరకు జాగ్రత్తలు పాటించమని చెప్తున్నారు కొత్త వేరియంట్ అయితేనే దాని తీవ్రత పట్ల ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో చెప్తామంటున్నారు అయితే అందాక మాత్రం ఆందోళనకు గురి కాకుండా సావధానంగా వ్యవహరించమని చెప్తున్నారు భారత్ లో జనసంఖ్య 140 కోట్లకు మించిపోయింది రెండు దశాబ్దాలుగా హెచ్ ఎం పివి వైరస్ ఉనికి ఇక్కడ ఉంది కనుక దాదాపుగా ప్రజల్లో యాంటీబాడీస్ వృద్ధి చెందే ఉంటాయన్నది నిపుణుల మాట అటు అమెరికా వాసుల్లోనూ ఈ వైరస్ బయటపడిందని అయితే ఎలాంటి దుర్వార్త
రాలేదని కాబట్టి ఎలాంటి అనవసర భయాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు పైగా చైనాలో ఏవో వైరల్ జ్వరాల వంటివి గత ఐదేళ్లుగా వస్తూ పోతుండడం మామూలు అయిపోయింది ఈసారి మాత్రం హాస్పిటల్స్ నిండిపోయేంతగా ప్రజలు అస్వస్థతకు గురి కావడంతో తక్కిన ప్రపంచ దేశాలు జాగ్రత్త పడుతున్నాయి ఊపిరితిత్తుల సమస్యలు శ్వాసకోస ఇబ్బందులు ఉన్నవాళ్ళంతా జాగ్రత్తగా ఉండమని అవసరమైతే కుటుంబ వైద్యుని సంప్రదించడం మేలని చెబుతున్నారు చైనా ప్రజల తాజా వ్యాధి తీవ్రత ఎటువంటిది అనే సంగతి ప్రపంచ ఆరోగ్య సంస్థ మిగతా ప్రపంచ దేశాలకు చెప్పాల్సి ఉంది అది దాని
బాధ్యత కనుక మన భారత ప్రభుత్వం ఇప్పటికే who తో నిర్విరామంగా సంప్రదింపులు జరుపుతోంది తాజా సమాచారం తమకు చెప్తూ ఉండమని కోరింది ఇందులో సహితుకత కూడా ఉంది కోవిడ్ 19 సమయంలో ఎన్నో విషయాలు చైనా చాలా గుంభనంగా వ్యవహరించి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసిందని నిపుణులు అభిప్రాయపడ్డారు ఎంతో కాలానికి గాని కోవిడ్ మహమ్మారి గురించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు అప్పటికీ చాలా నష్టం కష్టం జరిగిపోయింది ఇప్పుడు చూడబోతే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే భారతదేశంలోని ఇద్దరు చిన్న పిల్లల్లో హెచ్ ఎం పివి నిర్ధారణ కావడం కోలుకోవడం కూడా
జరిగిపోయింది కాబట్టి ఐదేళ్ల లోపు పసివాళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వం చెప్తోంది నిమోనియా లక్షణాలు ఏవి కనిపించినా సరే వెంటనే చికిత్స తీసుకోవాలని చెప్తోంది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం శ్వాస సంబంధమైన ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా సంబంధిత డాక్టర్ ని లేదా మీ కుటుంబ డాక్టర్ ని వెంటనే సంప్రదించండి అలాగని ఊరికే హైరాన పడొద్దు అలా కంగారు పడకండి అని భారత ప్రభుత్వమే చెప్తోంది ఏ చిన్న అపశృతి వినిపించినా ఆ దిశగా తనను తాను సిద్ధం చేసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్టు చెప్పింది 2019-20 లో
కోవిడ్ విషయంలో చైనా గుట్టుగా ఉండి మొత్తం ప్రపంచాన్ని భయకంపితుల్ని చేసినట్టుగా ఈసారి చేయకుండా అనుక్షణం జాగ్రత్తగా అసలు సిసలు సమాచారం సేకరించి అందిస్తూ ఉంటామని who కూడా చెప్తోంది మంచి వార్తలే విందామని మనందరం కోరుకుందాం అయినా కూడా కోవిడ్ సమయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుని వాటన్నిటిని మరొక్కసారి పాటిద్దాం మన మిత్రులకు బంధువులకు కూడా జాగ్రత్తలు సూచిస్తూ మనము పాటిస్తూ ఇది మరో మహమ్మారి కాకూడదని కోరుతూ ఆ శుభవార్తే ప్రభుత్వం చెప్పాలని కోరుకుందాం!