కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు Moral Story Telugu

కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అనేది సత్యం మనం ముందు చేసుకున్న కర్మ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు చేస్తున్న ఈ కర్మ ఫలితాలను తరువాత తప్పకుండా అనుభవించవలసిందే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు పూర్వం రాంపూర్ అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊరిలో ఒక మధ్య తరగతి కుటుంబం ఉండేది ఆ ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉండేవారు వారిది చాలా చిన్న కుటుంబం తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఇద్దరు పిల్లలు పెద్దవారవుతున్నారు పెద్దవాని పేరు రాజేష్ చిన్నవాని పేరు గోపి చిన్నవాడైన గోపి పెద్దవాడైన

రాజేష్ ను చూసి ఈర్ష పడేవాడు ఎందుకంటే రాజేష్ ఊర్లో ఉన్నవారికి సహాయం చేస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఉండేవాడు అందరూ అతన్ని మెచ్చుకునేవారు అది చిన్నవాడైన గోపికి నచ్చేది కాదు చిన్నవాడు అందరితో గొడవలు పడుతూ ఉండేవాడు ఏ పనిని సరిగ్గా చేసేవాడు కాదు తన తల్లిదండ్రులతో కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు చెడు అలవాట్లు ఉన్న స్నేహితులతో కలిసి తిరిగేవాడు ఇలా కొన్ని రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మరణించారు పెద్దవాడు తల్లిదండ్రులు మరణించినందుకు చాలా బాధపడతాడు ఇద్దరు కలిసి వారి అంత్యక్రియలను పూర్తి చేస్తారు ఆ తరువాత కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు Moral Story Telugu

పెద్దవాడు తల్లిదండ్రుల పేరు మీద ఊర్లో వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసే ఉండేవారు మెల్లిమెల్లిగా కాలం గడుస్తూ ఉంది పెద్దవాడు ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల పేరు మీద భోజనాలు పెట్టి దాన ధర్మాలు చేసేవాడు అది చిన్నవాడికి అస్సలు నచ్చేది కాదు ధనమంతా వృధాగా ఖర్చు చేస్తున్నాడు పైగా మంచి పేరు మా అన్నకు మాత్రమే వస్తుంది నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదు అంటూ లోలోపల అన్నపై ఈర్ష పడుతూ ఉండేవాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు చాలా మంచివాడు అందరికీ సహాయం చేసేవాడు ఒక రోజున

పెద్దవాడైన రాజేష్ మహారాజును కూడా భోజనానికి పిలుస్తాడు మహారాజు కూడా ఎంతో సంతోషంగా భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేస్తాడు ఎప్పటిలాగే పెద్దవాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తాడు ఇదంతా చిన్నవాడు చూస్తూనే ఉన్నాడు భోజనాలు ముగిసిన తర్వాత మహారాజు చిన్నవాడిని తన దగ్గరకు పిలుచుకొని ఇలా అంటున్నాడు మీ అన్న మీ తల్లిదండ్రులు స్వర్గంలో సుఖంగా ఉండాలని ఎన్నో దాన ధర్మాలు పూజలు చేస్తున్నాడు నువ్వు వాళ్ళ కోసం ఏమి చేయడం లేదు వాళ్ళు నీకు కూడా తల్లిదండ్రులే కదా నువ్వు కూడా వాళ్ళ కోసం ఏదైనా చేయవచ్చు కదా అని అంటాడు చిన్నవాడు ఏమీ

మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోయాడు చిన్నవాడికి విపరీతమైన కోపం వస్తుంది అందరి ముందు మహారాజు కూడా నన్ను అవమానించాడు మా అన్నను మాత్రం అందరూ గొప్పగా పొగుడుతున్నారు ఇక తన అన్నపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు తన అన్నను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు ఏం చేయాలి ఏం చేస్తే నాకు మేలు జరుగుతుంది అంటూ ఆలోచిస్తున్నాడు అప్పుడే అతనికి ఒక ఒక ఆలోచన వచ్చింది మరునాడు ఉదయాన్నే నగరంలో ఉన్న వారి ముందు గట్టిగట్టిగా ఏడుస్తూ మరణించిన నా తల్లిదండ్రులు ఎంతో దుఃఖ పడుతున్నారు వాళ్ళు నాకు రాత్రి కలలు కనిపించారు

వాళ్ళు స్వర్గంలో సుఖంగా లేరంట వాళ్లకు భోజనం వండి పెట్టే వాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరంట వారికి సేవ చేయడానికి నా అన్నను మా వద్దకు పంపించండి అని చెప్పారు ఎందుకంటే మా అన్న వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వారికి చాలా సేవలు చేశాడు మా పెద్ద కొడుకు మా వద్దకు వస్తే మా ఆత్మలకు శాంతి కలుగుతుంది అని వారు చెప్పారు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు ఆ విషయం మహారాజుకు తెలిసింది వెంటనే మహారాజు అక్కడికి చేరుకున్నాడు మహారాజు ముందుగా చిన్నవాడు చెప్పింది నమ్మకపోయినా అతని దొంగ ఏడుపులు చూసి నమ్మేస్తాడు తల్లిదండ్రులకు సేవ

చేయడం మంచిదే కానీ దాని కోసం రాజేష్ మరణించవలసి ఉంటుంది ముందు రాజేష్ ను ఇక్కడికి పిలిపించండి అంటూ ఆదేశిస్తాడు బటులు వెళ్లి రాజేష్ ను అక్కడికి తీసుకువస్తారు మహారాజు రాజేష్ కు జరిగినదంతా చెప్పి ఇప్పుడు ఏం చేయమంటావు అంటూ అడుగుతాడు అప్పుడు రాజేష్ కు పూర్తిగా అర్థమయింది తన తమ్ముడు తనను అడ్డు తొలగించుకునేందుకే ఈ ఉపాయం ఆలోచించాడు నేను ఇప్పుడు చెప్పినా ఎవ్వరూ నమ్మరు ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది ఏదో ఒక రోజున మరణించవలసిందే కదా అంటూ మహారాజా నా తల్లిదండ్రులు నన్ను అక్కడికి రమ్మని కోరుకుంటే దానిని నేను తప్పకుండా

అంగీకరిస్తాను మహారాజా మీరు రేపు ఉదయాన్నే నది వడ్డున ఒక పడవను తెచ్చి ఉంచండి నేను ఆ పడవలోంచి నదిలోకి దూకి మరణించి స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటాను అని అంటాడు ఇక మరునాడు ఉదయాన్నే రాజేష్ చెప్పినట్టుగా మహారాజు ఒక పడవను సిద్ధం చేస్తాడు ఊరందరూ అక్కడికి చేరుకున్నారు ఇదంతా చూస్తూ తమ్ముడు చాలా సంతోషిస్తున్నాడు ఇక రాజేష్ చివరి సారిగా ఊరందరినీ చూస్తూ పడవలోకి ఎక్కి నదిలో కొద్ది దూరం వెళ్లి అందరూ చూస్తూ ఉండగా గానే ఆ నదిలోకి దూకేశాడు ఇక తన స్నేహితులు బంధువులు చాలా బాధపడతారు ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం అంటూ అందరూ

బాధపడుతున్నారు ఇక చిన్నవాని సంతోషానికి హద్దులే లేవు ఇక నా అన్న ఆస్తులు కూడా నాకే లభిస్తాయి ఇక నాకు ఏ అడ్డు లేదు హాయిగా జీవించవచ్చు అని అనుకున్నాడు ఇలా నెల రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఉదయాన్నే రాజేష్ మహారాజు భవనం ముందు కూర్చొని ఏడుస్తూ కనిపించాడు భటులు వెళ్లి మహారాజుకు ఈ విషయం చెబుతూ అందరూ అతన్ని చూసి అతని వద్దకు వెళ్ళడానికే భయపడుతున్నారు మహారాజు రాజేష్ ను చూసి ఆశ్చర్య పోతాడు నువ్వు మరణించలేదా ఇది ఎలా సాధ్యం అసలు ఏం జరిగింది అంటూ అడుగుతాడు అప్పుడు రాజేష్ ఏడుస్తూ మహారాజా నేను మరణించి స్వర్గానికి వెళ్లి మా అమ్మా

నాన్నలను నెల రోజులు బాగా చూసుకున్నాను కానీ వాళ్ళు మాత్రం ఇంకా సంతోషంగా లేరు వాళ్ళు నన్ను తిడుతున్నారు నీకు సరిగ్గా వంట కూడా చేయడం రాదు మా సేవ కూడా నువ్వు సరిగ్గా చేయడం లేదు నీకన్నా నీ తమ్ముడు మంచి వంట వండుతాడు మాకు మంచిగా సేవలు చేస్తాడు నువ్వు మాకు వద్దు నువ్వు వెళ్ళిపోయి మీ తమ్ముడిని మా వద్దకు పంపు అప్పుడే మేము సంతోషంగా ఉంటాం అని అన్నారు ఇప్పుడు ఏం చేయమంటారు మహారాజా అంటూ ఏడుస్తున్నాడు ఆ మాటలు విన్న మహారాజు వెంటనే కొంతమంది సైనికులను గోపి వద్దకు పంపి అతన్ని తీసుకురమ్మని చెప్తాడు సైనికులు వెళ్లి అతన్ని మహారాజు వద్దకు

తీసుకొని వస్తారు అక్కడ తన అన్నను చూసిన గోపి గజగజా వణికి పోయాడు మహారాజు అతనికి జరిగిన విషయం మొత్తం చెప్పి మీ అన్న మీ తల్లిదండ్రుల కోసం ఇంత త్యాగం చేశాడు ఇక ఇప్పుడు నీ వంతు మీ తల్లిదండ్రులు నిన్నే అడుగుతున్నారంట వారికి నీ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా ఉంది ఇక నువ్వు కూడా మీ అన్న లాగే ప్రాణత్యాగం చేయాలి రేపు ఉదయాన్నే నది వద్దకు రా అన్ని ఏర్పాట్లు చేస్తాము అని అంటాడు ఇదంతా కూడా నేను ఆడిన నాటకం అని చెప్పాలనుకున్నాడు కానీ అలా చెబితే నేను దొరికిపోతాను మహారాజు నాకు మరణ దండన విధిస్తాడు అని అనుకున్నాడు ఎవ్వరికీ ఏమీ అనకుండా మౌనంగా ఇంటికి

చేరుకొని ఇలా ఆలోచిస్తున్నాడు అమ్మో నేను రేపు నది వద్దకు వెళ్తే అందరూ కలిసి నన్ను నదిలోకి తోసి చంపేస్తారు ఈరోజు రాత్రికే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు అటు పెద్దవాడు జరిగిన విషయం మొత్తం మహారాజుకు వివరిస్తాడు అసలు తాను ప్రాణాలతో ఎలా బ్రతికినది వివరిస్తున్నాడు మహారాజా నేను ముందుగానే చేపలు పట్టే వారికి మొత్తం నిజం చెప్పి నేను నదిలోకి దూకగానే కాపాడమని చెప్పాను వాళ్ళు నేను నదిలో దూకగానే నన్ను కాపాడి దూరంగా తీసుకువెళ్లారు ఒక నెల రోజులు ఊరికి దూరంగా ఉన్నాను మహారాజా నిజానికి ఇదంతా కూడా మా తమ్ముడు చేసిన కుట్ర నన్ను

చంపాలనుకున్నాడు అంటూ నిజం చెప్పేస్తాడు ఇటు చిన్నవాడు రాత్రి ఊరిని విడిచి వెళ్తుండగా అతను మహారాజు సైనికులకు కనబడతాడు వాళ్ళు అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కానీ అతను వినడం లేదు గోపికి కోపం వచ్చి ఒక కర్రతో సైనికుని తలపై కొడతాడు వెంటనే ఆ సైనికుడు అక్కడే కుప్పకూలి మరణిస్తాడు ఇదంతా మహారాజు తెలుసుకొని గోపికి ఏదో చిన్న శిక్షను వేసి వదిలేద్దాం అని అనుకున్నాడు కానీ అప్పుడే కొంతమంది సైనికులు వచ్చి గోపి సైనికున్ని చంపిన విషయం చెప్తారు అది విన్న మహారాజుకు విపరీతమైన కోపం వచ్చింది అప్పటివరకు అతన్ని క్షమించేద్దాం అని అనుకున్న

మహారాజు వెంటనే అతనికి మరణ శిక్షను విధిస్తాడు మరునాడు ఉదయాన్నే అతన్ని పట్టుకు వచ్చి పడవలోంచి నదిలోకి తోసి చంపేయండి అంటూ ఆదేశిస్తాడు సైనికులు అతన్ని వెంటాడి మహారాజు వద్దకు పట్టుకు వస్తారు చివరి నిమిషంలో తాను చేసిన తప్పులను తలుచుకొని బాధపడతాడు గోపి కానీ జరగవలసిందంతా జరిగిపోయింది ఇప్పుడు పశ్చాత్తాప పడిన ఏం లాభం అందరూ చూస్తూ ఉండగానే మహారాజు అతన్ని నదిలోకి తోసేస్తాడు ఇక అతను నదిలో మునిగి మరణిస్తాడు చూశారు కదా కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు మనం మంచి చేస్తే మంచిగానే మన వద్దకు తిరిగి వస్తుంది మనం చెడు చేస్తే మనకు చెడుగానే జరుగుతుంది కాకపోతే కొద్దిగా సమయం పడుతుంది కానీ కర్మ అనుభవించడం మాత్రం తప్పదు

Leave a Comment