మనం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాం మనం చేసే ఈ దానాలలో అన్నింటికంటే ఉత్తమమైన దానం ఏది ఎలాంటి దానం చేస్తే మనకు ఉత్తమమైన పుణ్యం లభిస్తుందో ఈ కథలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పూర్వం కాశీపురం అనే ఊరిలో సోము అనే వ్యక్తి ఉండేవాడు అతను ప్రతి రోజు అడవికి వెళ్లి అక్కడ కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని తీసుకువెళ్లి నగరంలో అమ్మి అలా వచ్చిన ధనంతో తాను జీవిస్తూ ఉండేవాడు అతని ఇంట్లో తాను తన భార్య మాత్రమే ఉండేవారు
తాను సంపాదించిన ధనం వారికి సరిపోయేది కాదు ఒకరోజు తన భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీరు కట్టెలు అమ్మి తెచ్చే ధనం మనకు సరిపోవడం లేదు మనం మంచి భోజనం చేయలేకపోతున్నాం ఏ పండుగలు చేసుకోలేకపోతున్నాం ఇక మీరు ఈ పనిని మానేసి నగరానికి వెళ్లి ఎక్కువ ధనం సంపాదించే వేరే ఏదైనా పనిని చేయండి అని అంటుంది అప్పుడు సోము చూడు నేను నీకు చాలాసార్లు చెప్పాను నేను ఈ ఊరిని విడిచి వెళ్ళను నగరంలో మనకు శాంతి లభించదు నేను పుట్టి పెరిగిన ఈ ఊరిలోనే నాకు ప్రశాంతంగా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే కట్టెల కోసం
అడవికి వెళ్లి ఒక మోపు కట్టెలను తీసుకొని వాటిని అమ్మడానికి నగరానికి చేరుకున్నాడు అతను చాలా సేపు ఆ నగరంలో తిరుగుతూనే ఉన్నాడు కానీ కానీ ఆ కట్టెలను ఎవ్వరూ కొనుక్కోవడం లేదు అతను తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు అలా అతను ఒక బ్రాహ్మణుని ఇంటి ముందుగా వెళ్తున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతడిని పిలిచి ఈ కట్టెలను ఎంతకు ఇస్తావు అంటూ అడుగుతాడు అప్పుడు సోము మీకు మొత్తం కట్టెలు కావాలా లేక సగం కట్టెలు కావాలా మొత్తం కట్టెల మోపు అయితే పది రూపాయలు సగం మోపు అయితే ఐదు రూపాయలు అని చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాకు మొత్తం కట్టెల మోపు కావాలి కానీ నేను అంత గొప్ప ధానం ఏది Moral Story Telugu
ధనం ఇవ్వలేను మొత్తం కట్టెలను ఐదు రూపాయలకు అయితే నేను ఇవ్వగలను అని అంటాడు అప్పుడు సోము నేను అంత తక్కువకు ఇవ్వలేను కానీ ఇప్పుడు నేను తిరిగి తిరిగి బాగా అలసిపోయాను చీకటి కూడా పడబోతుంది వీటిని తిరిగి నేను ఇంటికి తీసుకువెళ్ళలేను ఐదు రూపాయలు అయినా పర్వాలేదు ఇచ్చేయండి నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలను తీసుకొని ఐదు రూపాయలను సోముకు ఇస్తూ నాయనా ఆకలి వేస్తుంది అని అన్నావు కదా ఈ పూటకి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు తినడానికి అంతా సిద్ధంగా ఉంది అని అంటాడు అప్పుడు సోము
నాకు బాగా ఆకలి వేస్తుంది నిజమే కానీ నేను మీ ఇంట్లో భోజనం చేస్తే మళ్ళీ మీకు భోజనం ఉండదు మీకెందుకు ఇబ్బంది పెట్టడం నేను మా ఇంటికి వెళ్లి తింటానులే అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయనా నువ్వేమీ భయపడకు నువ్వు తిన్నాక కూడా ఇంకా 10 మంది తినేంత భోజనం నా వద్ద ఉంది ఇప్పుడే కాదు నీకు ఎప్పుడు ఆకలిగా అనిపించినా ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చు అని అంటాడు అప్పుడు సోము మీరు ప్రతిరోజు భోజనం పెడుతూనే ఉంటారా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయనా నాకు ఆ భగవంతుడు ఇస్తున్నన్ని రోజులు ఆయన దయ నాపై ఉన్నన్ని రోజులు నేను నలుగురికి నా ఇంట్లో భోజనం
పెడుతూనే ఉంటాను అని అంటాడు అప్పుడు సోము సరే అయితే నేను ఈరోజు ఇక్కడే తింటాను అని కడుపు నిండా భోజనం చేసి మహాత్మ మీరు చాలా గొప్పవారు మీరు మంచి పనిని చేస్తున్నారు మీ మంచి పనిలో నేను కూడా భాగం పంచుకోవాలనుకుంటున్నాను నా వంతుగా నేను కూడా మీకు సహాయం చేస్తాను ఇప్పటి నుండి పది రూపాయల విలువ చేసే కట్టెలను మీకు సగం ధరకే అంటే ₹5కే ఇస్తాను అని చెప్పి సోము ఆనందంగా ₹5 తీసుకొని అక్కడ నుండి తన ఇంటికి చేరుకున్నాడు అప్పుడు అతని భార్య ఏమైంది ఎందుకు ఇంత ఆలస్యం అయింది ఏదైనా మంచి గిరాకి వచ్చిందా ఎంత ధనం వచ్చిందో నాకు ఇవ్వండి సరుకులు తేవాలి అని అంటుంది
అప్పుడు సోము చూడు ఈరోజు ధనం తక్కువగా వచ్చింది కేవలం ఐదు రూపాయలే వచ్చినాయి ఇదిగో తీసుకో అంటూ ఆమె చేతికి ఇస్తాడు వాటిని చూసి ఆమెకు చాలా కోపం వచ్చింది ఏంటి రోజు తెచ్చే ధనం కన్నా ఈరోజు చాలా తక్కువగా తీసుకువచ్చారు అది కూడా ఇంత ఆలస్యం చేసి వచ్చారు ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సోము నేను కట్టెలను తీసుకొని నగరమంతా తిరిగాను కానీ సాయంత్రం వరకు నా కట్టెలను ఎవ్వరూ కొనలేదు అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు నన్ను పిలిచి పది రూపాయల కట్టెలను ఐదు రూపాయలకు ఇవ్వమన్నాడు ఇక చీకటి పడుతుంది కదా అని ఆ కట్టెలను ఐదు రూపాయలకే ఆయనకు ఇచ్చేసాను ఆ బ్రాహ్మణుడు
చాలా గొప్ప వ్యక్తి ఆకలితో వారి ఇంటి ముందుకు ఎవరు వచ్చినా వారికి ఎంతో ప్రేమగా భోజనం పెడుతున్నాడు నాకు కూడా చాలా ప్రేమగా భోజనం పెట్టాడు ఆయన చేస్తున్న ఆ గొప్ప పని నాకు బాగా నచ్చింది అలాంటి పనికి నా వంతుగా సహాయం చేయాలి అని రేపటి నుండి సగం ధరకే కట్టెలు తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను ఇక రేపటి నుండి కొన్ని ఎక్కువ కట్టెలను ఆ బ్రాహ్మణుని కోసం తెస్తాను మిగతావి అమ్ముతాను అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీకేమైనా పిచ్చి పట్టిందా మనకు సరిగ్గా తినడానికి తిండే దొరకడం లేదు అలాంటిది మీరు అతనికి సహాయం చేస్తాను అని మాట ఇచ్చారు అతను అందరికీ
రోజు భోజనం పెడుతున్నాడంటే అతని వద్ద చాలా ధనం ఉండి ఉంటుంది అందుకే అతను అందరికీ భోజనం పెడుతున్నాడు మన వద్ద ఏముందని మీరు అతనికి సహాయం చేస్తారు అని అంటుంది అప్పుడు సోము నువ్వు అనుకుంటున్నట్టుగా అతను ధనవంతుడు కాదు ఆయన కేవలం మంచి మనస్సుతో దానం చేస్తున్నాడు ఆయన ఆ ఊరి శివాలయంలో పూజారి తాను సంపాదించిన దానితోనే అన్నదానం చేస్తున్నాడు ఆయన చాలా గొప్ప వ్యక్తి అని అంటాడు ఇక అతని భార్య ఏమీ అనకుండా కోపంగా అక్కడ నుండి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇలా ప్రతి రోజు కట్టెలను తెచ్చి కేవలం ఐదు రూపాయలకే ఆ పూజారికి ఇచ్చి అక్కడ భోజనం చేసి ఐదు రూపాయలను
తీసుకొని వెళ్ళిపోయేవాడు ఒకరోజు పూజారి భోజనం చేయడానికి సిద్ధమైనప్పుడు బయట నుండి ఒక శబ్దం వినబడింది మహాత్మ కట్టెలను తెచ్చాను వీటిని తీసుకోండి అంటూ సోము బయట నుండి అరుస్తున్నాడు అప్పుడు ఆ పూజారి బయటకు వచ్చి నాయనా నేను ఈరోజు నీకు ఐదు రూపాయలను ఇవ్వలేను నా వద్ద ఈరోజు ధనం లేదు నీవు కట్టెలను వేరే ఎవరికైనా అమ్ముకో అని అంటాడు అప్పుడు సోము మహాత్మ మీ కోసమే నేను ఈ కట్టెలను తెచ్చాను మీరు డబ్బులను రేపు ఇవ్వండి నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు నాకు బాగా ఆకలి వేస్తుంది ముందు నాకు భోజనం పెట్టండి అని అంటాడు అప్పుడు ఆ
పూజారి సరే నాయనా భోజనం వడ్డిస్తాను నువ్వు కట్టెలను పక్కన పెట్టి లోపలికి రా అంటూ లోపలికి వెళ్లి తన భార్యకు ఈ విషయం చెబుతాడు అప్పుడు ఆ పూజారి భార్య చూడండి మన ఇంట్లో తినడానికి ఇప్పుడు ఏమీ లేదు మీరు ఇప్పుడు తింటున్న ఆ అన్నం మాత్రమే ఉంది మీరు ఎందుకు అతనికి భోజనం పెడతాను అని అన్నారు అతనికి ఏం పెడతారు అంటూ అడుగుతుంది అప్పుడు పూజారి ఇందులో ఏముంది నాకు వడ్డించాలనుకున్న ఈ భోజనం అతనికే తినిపిద్దాం ఈరోజు నేను ఉపవాసమే ఉంటాను అతిధికి భోజనం పెట్టడమే మహా పుణ్యం అని అంటాడు ఇక పూజారి భార్య ఆ భోజనాన్ని సోముకే వడ్డించేస్తుంది ఇక సోము భోజనం
చేసి ఉట్టి చేతులతోనే ఆ రోజు ఇంటికి చేరుకున్నాడు ఇక ఉదయాన్నే లేచి ఈరోజు ఎక్కువ కట్టెలను తీసుకువెళ్లి మంచి ధరకు అమ్ముకోవాలి అంటూ అడవి లోపలికి వెళ్లి ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కి ఒక కొమ్మను నరుకుతాడు ఆ కొమ్మ క్రింద పడగానే ఆ చెట్టు కింద ఉన్న పొదల్లో నుంచి ఒక సాధువు బయటకు వస్తాడు అతను కోపంతో ఊగిపోతూ నా తపస్సును ఎవరు భంగం చేశారు అంటూ చెట్టు పైకి చూస్తాడు అక్కడ చెట్టు పైన సోము కనిపిస్తాడు ఓరి మూర్ఖుడా నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేసుకుంటున్నాను ఈరోజు నువ్వు నా తపస్సును భంగం చేశావు నేను నీకు ఇప్పుడే శాపం
పెడుతున్నాను నువ్వు కుక్కలాగా మారిపో అంటూ శాపం పెడతాడు అప్పుడు సోము భయపడుతూ మహాత్మ నేను మిమ్మల్ని గమనించలేదు నేను ఈ అడవికి రోజు వచ్చి ఇక్కడ కట్టెలను కొట్టుకొని వెళ్లి వాటిని నగరంలో అమ్మి జీవిస్తూ ఉంటాను నేను కావాలని ఈ పనిని చేయలేదు నన్ను క్షమించండి మీరు పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటూ ఆ సాధువు కాళ్ళ మీద పడతాడు అప్పుడు ఆ సాధువు నాయనా నా తపస్సు భంగమయిందనే కోపంతో నేను నీకు శాపం ఇచ్చాను కానీ ఆ శాపాన్ని నేను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు ఇక నువ్వు దానిని అనుభవించవలసిందే అని అంటాడు ఆ కొద్దిసేపటికే సోము నల్ల కుక్కలాగా
మారిపోయాడు అతను ఏడుస్తూ మహాత్మ నేను కుక్కలాగా మారిపోయాను నా భార్యను ఎలా పోషించాలి ఇలా ఉంటే అది ఎలా సాధ్యం శాప విమోచనానికి ఏదైనా దారి ఉంటే చెప్పండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయనా నువ్వేమీ భయపడకు నీ భార్య గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఆ భగవంతుడు అన్ని చూసుకుంటాడు నాయనా శాప విమోచనానికి ఒక్క దారి ఉంది అదేమిటంటే ఎవరైతే గొప్ప దానాన్ని చేస్తారో అలాంటి ఇద్దరు వ్యక్తులు తినగా మిగిలిన ఒక్క మెతుకు అయినా పర్వాలేదు దానిని నువ్వు తింటే నీకు శాప విమోచనం కలుగుతుంది నువ్వు వెళ్లి ఎవరు గొప్ప దానం చేస్తున్నారో వాళ్ళను
వెతికి వారు తినగా మిగిలిన దానిని నువ్వు తిను నీకు ఇప్పుడున్న ఈ నలుపు రంగు ఎప్పుడైతే పూర్తిగా తెల్ల రంగులోకి మారుతుందో అప్పుడే నీకు పూర్తిగా శాప విమోచనం కలుగుతుంది అని అంటాడు ఇక బాధతో సోము అక్కడ నుండి నగరంలోకి వెళ్ళిపోయాడు గొప్ప దానాన్ని ఇచ్చేవారు ఎవరు ఉంటారు నాకు ఏమీ అర్థమే కావడం లేదు అవును పూజారి ఉన్నాడు కదా ఆయన ప్రతి రోజు అన్నదానం చేస్తూనే ఉంటాడు ఆయన చాలా గొప్పవాడు నేను ముందుగా ఆ పూజారి ఇంటికే వెళ్తాను అంటూ నేరుగా పూజారి ఇంటికి చేరుకున్నాడు ఆ పూజారి భోజనం చేసిన తర్వాత ఆ మిగిలిన అన్నం తిందామని బయట నిలబడి వేచి
చూస్తున్నాడు అలా కొద్దిసేపటికి ఆ పూజారి భోజనం చేస్తాడు ఆయన తినగా మిగిలిన ఆహారాన్ని ఆయన భార్య బయట పారవేసింది వెంటనే సోము ఆనందంగా ఆ మిగిలిన ఆహారాన్ని తినేసాడు అలా అన్నం తినగానే అతని శరీరం సగం తెలుపు రంగులోకి మారిపోయింది అది చూసి సోము చాలా సంతోషించాడు నాకు తెలుసు ఈ పూజారి చాలా గొప్పవాడు మంచి మనస్సుతో దానం చేస్తున్నాడు అందుకే నాకు సగం శాప విమోచనం కలిగి జరిగింది ఇంకా సగం శాప విమోచనానికి వేరే వారిని వెతకాలి అంటూ అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయాడు అలా వెతుకుతూ వెతుకుతూ పక్క ఊరికి చేరుకొని రాత్రి ఒక ఇంటి ముందు పడుకున్నాడు ఉదయం లేవగానే
సోముకి ఒక సంఘటన కనిపించింది ఆ ఇంటి యజమాని ఒక వ్యక్తికి గోవును దానంగా ఇస్తున్నాడు ఆ గోవును దానం తీసుకున్న వ్యక్తి ఇలా అంటున్నాడు మీరు చాలా గొప్పవారు నాకే కాదు మీరు చాలా మందికి గోవులను దానం చేస్తున్నారు మీకు చాలా వస్తుంది అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ మాటలు విన్న సోము చాలా సంతోషిస్తాడు అమ్మయ్య ఇక నాకు పూర్తిగా శాప విమోచనం కలిగినట్టే ఇతను చాలా గొప్పవాడు ఆహారాన్ని కాదు ఏకంగా గోవులనే దానంగా ఇస్తున్నాడు ఇంతకన్నా గొప్ప దానం ఏముంటుంది ఇతను కూడా పూజారి లాగా చాలా గొప్పవాడు ఇక నేను ఈరోజు ఇక్కడే
ఆగి అతను తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని తిని నా శాపం నుండి ముక్తి పొంది పూర్వ రూపం పొందుతాను అని అంటాడు ఇక రాత్రి ఆ వ్యక్తి భోజనం చేసి తిన్న విస్తరాకును బయట పారవేశాడు ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సోము వెంటనే వెళ్లి ఆ విస్తరాకులోని మిగిలిన ఆహారాన్ని తింటాడు కానీ తనలో ఏ మార్పు రాలేదు రంగు కూడా మారలేదు అప్పుడు సోము ఏంటి ఇలా జరిగింది ఈ వ్యక్తి గోవులను దానం చేస్తున్నాడు అది మహా పుణ్యమే కదా మరి నా రంగు ఎందుకు మారలేదు నాకు ఏమీ అర్థమే కావడం లేదు అంటూ నిరాశతో అక్కడ నుండి ముందుకు వెళ్తున్నాడు అప్పుడే పక్క ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఇలా
మాట్లాడుకుంటున్నారు చూసావా అతను ఈరోజు కూడా గోవును దానం చేశాడు అతను ఏ గోవును దానం చేసినా ఊరి వాళ్ళకు దానం చేయడు ఎప్పుడూ వేరే ఊరి వాళ్ళకే దానం చేస్తాడు అలా ఎందుకు చేస్తాడు అంటూ అడుగుతాడు అప్పుడు ఎదుటి వ్యక్తి నువ్వు నిజం తెలుసుకుంటే ఆశ్చర్య పోతావు అతని వద్ద చాలా ఆవులు ఉన్నాయి అందులో పాలు ఇవ్వని వాటిని బక్క చిక్కి రోగంతో ఉన్న వాటిని తనకు వాటితో ఏమీ లాభం లేని గోవులను మాత్రమే దానం చేస్తాడు పాలను ఇచ్చే మంచి ఆవులను దానం చేయడు పని చేయని గోవులను వృధాగా పోషించవలసి వస్తుందని వాటిని దానం చేస్తూ ఉంటాడు అప్పుడు ఎదుటి వ్యక్తి
అవునా పని చేయని ఆవులను మాత్రమే దానం చేస్తున్నాడా అతను చాలా స్వార్ధపరుడు అయినా మన మహారాజు అందరికన్నా గొప్ప దాన గుణం కలవాడు ధర్మాత్ముడు ఒక నెల రోజుల నుండి అందరికీ అన్నదానం చేస్తున్నాడు ఇక రేపు అన్నదానంతో పాటు అందరికీ వస్త్రదానం కూడా చేస్తాడంట అతను అందరితో కలిసే తింటున్నాడు నేను ఇంతవరకు అలాంటి ధర్మాత్మున్ని చూడనే లేదు ఎన్నో మంచి మంచి పనులను ప్రజల కోసం చేస్తున్నాడు అని అంటాడు ఆ మాటలు వినగానే సోముకి చాలా ఆనందం కలిగింది ఇక ఇప్పుడు తప్పకుండా నాకు శాపం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది నేను వెంటనే మహారాజు వద్దకు వెళ్లి ఆయన తినగా
మిగిలిన ఆహారాన్ని తిని పూర్వ రూపం పొందాలి అంటూ వెంటనే మహారాజు కోట ముందుకు వెళ్లి చూస్తున్నాడు ఇక తెల్లవారింది అందరూ కోట ముందుకు చేరుకున్నారు మహారాజు బయటకు వచ్చి అందరికీ అన్నదానం వస్త్రదానం చేస్తున్నాడు అది చూసిన సోము చాలా సంతోషిస్తాడు ఇక మహారాజు ఎప్పుడు భోజనం చేస్తాడా అంటూ ఎదురు చూస్తున్నాడు ఇక మహారాజు కూడా అందరితో కలిసి భోజనం చేసేసాడు మహారాజు తిన్న విస్తరాకును బటులు తెచ్చి బయట పారవేశారు ఇక సోము ఆనందంగా అందులో మిగిలిన ఆహారాన్ని తినేసాడు కానీ ఏం లాభం సోము రంగు మాత్రం మారలేదు ప్రయత్నం అంతా వృధా అయ్యింది అప్పుడు సోము
అసలు ఏం జరుగుతుంది మహారాజు ఇంత గొప్పగా ఇంతమందికి నెల రోజుల నుండి అన్నదానం చేస్తున్నాడు ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు ఇలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తే కదా మరి నా రంగు ఎందుకు మారలేదు ఈ శాపం ఏదో విచిత్రంగా ఉంది నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ వెంటనే పరిగెడుతూ శాపం ఇచ్చిన సాధువు వద్దకు చేరుకున్నాడు నిరాశలో ఉన్న సోమును చూసిన సాధువు ఏం నాయనా ఇంకా నువ్వు శాపం నుండి విముక్తివి కాలేదా నీ సగం రంగు మాత్రమే మారింది అంటే నీకు ఒక్కరే గొప్ప దానాలు చేసే వ్యక్తి దొరికినట్టుగా ఉన్నాడు మరి రెండవ వ్యక్తి నీకు కనిపించలేదా అంటూ అడుగుతాడు అప్పుడు
సోము మహాత్మ నేను మొదటగా ఒక పూజారి తిన్న ఆహారం తిని సగం రంగు మారాను ఆ తరువాత అంతకన్నా ఎక్కువ దానాలు చేసే వ్యక్తుల ఆహారం తిన్నాను అయినా కూడా ఏ మార్పు రాలేదు నేను గోవులను దానం చేసే వ్యక్తి వ్యక్తి ఆహారం తిన్నాను మార్పు రాలేదు అంతేకాదు అందరికీ సహాయం చేస్తూ నెల రోజులుగా అందరికీ అన్నదానం చేస్తున్న మహారాజు మిగిల్చిన ఆహారాన్ని కూడా తిన్నాను కానీ నాలో ఏ మార్పు రాలేదు ఇద్దరు కూడా మంచి పనే చేశారు కదా మరి నాకు ఎందుకు శాపవిమోచనం కలగలేదు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయనా నువ్వు చూసిన ముగ్గురిలో ఇద్దరిది గొప్ప దానం కాదు
గోవులను దానం చేసే వ్యక్తిని చూస్తే అతనికి అవసరం లేని గోవులను మాత్రమే దానం చేస్తున్నాడు ఎందుకంటే వాటిని ఊరికే ఇంట్లో ఉంచుకుంటే దానికి ఆహారం పెట్టవలసి ఉంటుంది దానివల్ల అతనికి ఏ ప్రయోజనం ఉండదు అందుకే వాటిని దానం పేరుతో వదిలించుకుంటున్నాడు ఇక మహారాజు గురించి చూస్తే మహారాజు ఏది చేసినా అది దానం కాదు అది అతని బాధ్యత అంతేకాదు మహారాజు తాను స్వయంగా ఏమి సంపాదించి దానం చేయడం లేదు కదా ప్రజల నుండి పన్నులు వసూలు చేసి మళ్ళీ వాటినే దానం చేస్తున్నాడు ఇందులో అతను కష్టం కష్టపడి సంపాదించింది ఏమీ లేదు కదా అందుకే అతను చేసిన దానం గొప్పది కాదు
అందుకే నువ్వు ఇద్దరి భోజనం తిన్నా రంగును మారలేదు ఇద్దరి దానంలో కూడా స్వార్ధమే ఉంది గొప్ప దానం చేసింది ఆ పూజారి మాత్రమే ఎందుకంటే అతను కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి ఏ స్వార్ధం లేకుండా ఆకలితో వచ్చిన వారికి తాను తినకుండా దానం చేస్తున్నాడు అతని దానంలో ఏ స్వార్ధం లేదు అందరికీ ఒకేలా దానం చేస్తున్నాడు అతను ధనవంతుడు కూడా కాదు కానీ నిస్వార్ధంగా దాన ధర్మాలు చేస్తూ ఆకలితో ఉన్న నలుగురి ఆకలిని తీరుస్తున్నాడు అందుకే అతని దానం చాలా గొప్పది అందుకే నువ్వు అతని భోజనం తినగానే సగం రంగు మారిపోయి సగం శాప విమోచనం కలిగింది ఇంకో అలాంటి వ్యక్తి కోసం
ప్రయత్నించు అప్పుడే నీకు పూర్తిగా శాప విముక్తి కలుగుతుంది అని చెప్తాడు అప్పుడు సోము మహాత్మ నాకు బాగా అర్థమయింది నేను అలాంటి వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక సోము అలాంటి వ్యక్తి కోసం వెతుకుతూనే ఉన్నాడు వేరే వేరే ఊర్లకు వెళ్తున్నాడు ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఇలా తిరుగుతూ ఉండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది ఒక 80 సంవత్సరాల వృద్ధుడు ఎండలో నీటిని తెచ్చి దారి పక్కన చెట్టు క్రింద ఉన్న ఒక కుండలో పోసి వెళ్తున్నాడు అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా అనుకుంటున్నారు ఈ
వ్యక్తి చాలా గొప్పవాడు గత 30 సంవత్సరాలుగా నీటిని తెచ్చి ఈ కుండలో పోస్తున్నాడు ఇలా ఎండలో నడుచుకుంటూ వచ్చి అలసిపోయిన వారు ఈ చెట్టు కింద కూర్చొని ఈ కుండలోని నీటిని త్రాగి వెళ్తున్నారు ఇతను ఏ స్వార్ధం లేకుండా చాలా మంచి పనిని చేస్తున్నాడు అని అంటారు అది విన్న సోము అమ్మయ్య ఇన్ని రోజులకు నాకు ఒక గొప్ప వ్యక్తి కనిపించాడు ఇతను ఆ సాధువు చెప్పినట్టుగా ఏ స్వార్ధం లేకుండా నీటిని దానం చేసి అందరి దాహం తీరుస్తున్నాడు ఇక ఇతను తిన్న దానిని నేను తింటే నాకు తప్పకుండా శాప విమోచనం కలుగుతుంది అంటూ మెల్లిమెల్లిగా ఆ వృద్ధుని వెంట
వెళ్తున్నాడు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ వృద్ధుడు ఒక చెట్టు క్రింద కూర్చొని తాను ఇంటి నుండి తెచ్చుకున్న రొట్టెలను తింటున్నాడు ఇక సోము వెంటనే అతని వద్దకు చేరుకున్నాడు ఆ వృద్ధుడు సోమును చూసి తాను తింటున్న రొట్టెను సోముకి ఇస్తాడు ఆ రొట్టెను తినగానే సోముకి పూర్తిగా శాపం నుండి విముక్తి లభించి పూర్వ రూపం వచ్చింది ఇక వృద్ధుడికి జరిగినదంతా వివరించి అతనికి ధన్యవాదాలు చెప్పి ఆనందంగా అక్కడ నుండి తన ఇంటికి చేరుకొని తన భార్యతో సంతోషం సంతోషంగా జీవిస్తూ నలుగురికి సహాయం చేస్తున్నాడు ఇటు ప్రతిరోజు అన్నదానం చేసే పూజారికి
మాత్రం దానం చేసి చేసి పేదరికం వచ్చేసింది వారికి తినడానికి కూడా తిండి లభించడం లేదు అందరూ ఇంటికి భోజనానికి వస్తుండడంతో వారికి భోజనం పెట్టలేనందుకు ఆ పూజారి చాలా బాధపడుతున్నాడు అప్పుడు అతని భార్య అతని వద్దకు వచ్చి చూడండి మనం ఇప్పుడు చాలా కష్టాలలో ఉన్నాము రెండు పూటలా తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకడం లేదు మనకోసం అంటూ మనం ఏమీ దాచుకోలేదు మనం ఇన్ని రోజులు చేసిన మంచి పనికి కొంతైనా పుణ్యం లభించి ఉంటుంది ఇప్పుడు మన వద్ద పుణ్యం తప్ప ఏమీ మిగలలేదు అందరూ చెబుతూ ఉంటే నేను విన్నాను మన పక్క ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి
ఉన్నాడు ఆయన ఒక విచిత్రమైన పనిని చేస్తున్నాడు అతను మనం చేసిన పుణ్యం కొనుక్కొని దానికి సమానంగా ధనం ఇస్తున్నాడంట మన వద్ద ఉన్న పుణ్యం అతనికి అమ్మేసి ధనం తీసుకురండి లేదంటే మనం ఆకలితోనే చనిపోతాం అని అంటుంది ఆ పూజారికి ఆ పనిని చేయడం అస్సలు ఇష్టమే లేదు కానీ భార్యను కష్టపెట్టడం ఇష్టం లేక సరే అని ఒప్పుకున్నాడు ఇక మరునాడు ఉదయాన్నే నాలుగు రొట్టెలను మూట కట్టుకొని ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరాడు నడుచుకుంటూ నడుచుకుంటూ బాగా అలసిపోయాడు ఇక అతనికి బాగా ఆకలి కూడా వేస్తుంది ఒక చెట్టు కింద కూర్చొని వెంట తెచ్చుకున్న రొట్టెలను
విప్పుతాడు అప్పుడే ఒక కుక్క దాని ముగ్గురు పిల్లలను తీసుకొని అతని వద్దకు చేరి అతని వైపు దీనంగా చూసింది ఆ కుక్క ఆ అడవిలో పిల్లలకు జన్మనిచ్చింది ఆకలితో కుక్క పిల్లలు అరుస్తున్నాయి వాటి దీన స్థితిని చూసి అతనికి చాలా బాధ కలిగింది ఆ నాలుగు రొట్టెలను కూడా ఆ కుక్కలకే ఇచ్చేసి నీరు మాత్రమే త్రాగి అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయాడు ఇక ఆ వ్యాపారి వద్దకు చేరుకున్నాడు అతన్ని చూసిన వ్యాపారి ఏం కావాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పూజారి చూడండి మీరు పుణ్యం కొనుక్కొని దానికి సమానమైన ధనం అంట కదా నేను చేసిన పుణ్యాన్ని కొనుక్కొని నాకు ధనాన్ని
ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి లోపలికి వెళ్లి తన భార్యతో ఇలా అంటున్నాడు అతని భార్య మహా పతివ్రత దివ్య దృష్టి కలది మన ఇంటి ముందుకు ఒక బ్రాహ్మణుడు వచ్చి తాను సంపాదించిన పుణ్యాన్ని అమ్ముతాడంట నేను అతని వద్ద నుండి ఏ పుణ్యం తీసుకోవాలి అంటూ అడుగుతాడు అప్పుడు అతని భార్య దివ్య దృష్టితో చూసి అతను వచ్చే దారిలో ఆకలితో ఉన్న నాలుగు కుక్కలకు నాలుగు రొట్టెలను ఇచ్చి పుణ్యం సంపాదించాడు అతని వద్ద నుండి మీరు ఆ పుణ్యం కొనుక్కోండి అని చెబుతుంది అప్పుడు ఆ వ్యాపారి బయటకు వచ్చి నాయనా నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు దానివల్ల నీకు చాలా
పుణ్యం లభించింది కానీ అన్నింటికంటే గొప్ప పుణ్యం నువ్వు ఇంతకు ముందే చేశావు ఆకలితో బాధపడుతున్న కుక్కలకు నువ్వు తినకుండా ఆ రొట్టెలను వాటికి దానం చేశావు దానివల్ల నీకు లభించిన పుణ్యం చాలా గొప్పది దానినే నేను కొనుక్కుంటాను అని అంటాడు ఆ మాటలు విన్న పూజారి ఆశ్చర్య పోయాడు నేను వాటికి రొట్టెలు ఇచ్చినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు నన్ను ఎవ్వరూ చూడలేదు నేను ఎవ్వరికీ చెప్పలేదు మరి మీకు ఎలా తెలిసింది ఆ విషయం అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి నా భార్య దివ్య దృష్టితో ఒక వ్యక్తిని చూసి వారు చేసిన పుణ్యాలన్నింటిని తెలుసుకుంటుంది ఆమె నాకు ఈ విషయం
చెప్పింది అని అంటాడు అప్పుడు ఆ పూజారి సరే అయితే ఆ పుణ్యాన్నే తీసుకోండి కానీ దానికి బదులుగా మీరేమి ఇస్తారు అప్పుడు ఆ వ్యాపారి నువ్వు ఆ కుక్కలకు పెట్టిన రొట్టెలు ఎంత బరువుగా ఉన్నాయో అంత బరువు గల వజ్రాలు బంగారం తూకం వేసి ఇస్తాను అని అంటాడు దానికి పూజారి ఒప్పుకున్నాడు పూజారి చెప్పిన విధంగా నాలుగు రొట్టెలు చేయించాడు త్రాసులో ఒకవైపు రొట్టెలను మరొక వైపు వజ్రాలు బంగారాన్ని ఉంచుతాడు ఎన్ని వజ్రాలు బంగారం త్రాసులో ఉంచినా ఆ రొట్టెలకు సమానం కావడం లేదు ఆ వ్యాపారి ఇంకా వజ్రాలను వేస్తూనే ఉన్నాడు అయినా కూడా రొట్టెలు ఉన్న త్రాసు ఏమాత్రం పైకి
కి లేవడం లేదు ఆ వ్యాపారికి ఏమీ అర్థమే కావడం లేదు అది చూసిన పూజారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తాను చేసిన పుణ్యం ఎంత గొప్పదో అతనికి తెలిసింది అన్ని వజ్రాలు బంగారం కన్నా తాను చేసిన పుణ్యమే గొప్పదని తెలుసుకున్నాడు అతను ఆ వ్యాపారిని చూస్తూ చూడండి నా కళ్ళు తెరుచుకున్నాయి నా పుణ్యాన్ని నేను మీకు అమ్మను అని చెప్పి అతను అక్కడ నుండి ఇంటి వైపుకు వెళ్తున్నాడు మళ్ళీ అదే దారిలో తిరిగి వెళ్తున్నాడు అతను కుక్కలకు ఎక్కడైతే రొట్టెలు పెట్టాడో అక్కడికి చేరుకొని అలసిపోయి కూర్చున్నాడు అప్పుడే అతని పక్కన ఏదో ఒక మూట కనిపించింది వెంటనే
ఆశించి మనం ఎంత దానం చేసినా అది వ్యర్థమే అవుతుంది చూశారు కదా మీకు గనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ
దానిని తెరిచి చూశాడు అందులో విలువైన వజ్రాలు బంగారం కనిపించాయి అతను చుట్టూ చూశాడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఇక అతనికి చాలా సంతోషం కలిగింది ఆ భగవంతుడే తనకు ఈ ధనం ప్రసాదించాడు అని అనుకున్నాడు సంతోషంగా ఇంటికి చేరుకొని జరిగినదంతా తన భార్యకు చెప్తాడు ఇక అప్పటి నుండి వాళ్ళు ఇంతకు ముందు లాగే అందరికీ అన్నదానం చేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు చూశారు కదా ఎవరైతే ఆకలితో ఉంటారో ఎవరైతే కష్టాలలో ఉంటారో అలాంటి వారికి నిస్వార్ధంగా చేసిన దానం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది దానం చేయడం అనేది నిస్వార్ధంగా చేయాలి ఏదో ఒకటి