కాళికా దేవి జన్మ వృత్తాంతం, రూపం, శక్తి – పూరాణిక కథలు మరియు విశేషాలు
మెడలో కపాలాల దండ రక్తం కారుతూ ఉన్న ఎర్రటి నాలుక ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో రాక్షసుడి తలతో చూడగానే భయం కలిగించే రూపం కాళికాదేవి సొంతం ఆ శివ భగవానుడే ఆమె కాళ్ళ కింద ఉండడం మనం చూసే ఉంటాం ఈ ఈశ్వరుడి కంటే కూడా ఎంతో శక్తివంతమైనదే కాళికా దేవి అని మనకు ఆమె రూపాన్ని చూస్తేనే అర్థమవుతుంది కోపంలో కాళికా దేవిని శివుడు తప్పించి ఇంకెవ్వరు కూడా శాంతించేలా చేయలేరు ఎంత ఉగ్ర రూపం ఉన్నప్పటికీ కి కూడా కాళికాదేవి భక్తులకు కొదవలేదు భక్తుల మీద ఆమె అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉంటారు అసలు కాళికాదేవి జన్మ వృత్తాంతం ఏంటి ఆమె రూపం ఎందుకు ఇలా ఉంటుంది.
మంచితనం విజయం సాధించడానికి ప్రతీకగా కాళికా దేవిని చెప్పుకుంటూ ఉంటారు శక్తికి సృజనాత్మకతకు మారు పేరు కాళికా దేవి ధర్మ సంస్థాపన కోసం పాపాత్ములను శిక్షించడానికి కాళికాదేవి జన్మించింది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి మహాకాళి గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ ఈరోజు మేము మీకు రెండు ముఖ్యమైన కథల గురించి చెప్పబోతున్నాము పూర్వం దారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మ దేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మ దేవుడి అనుగ్రహాన్ని పొందుకున్నాడు.
బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా అతనికి కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చావు లభిస్తుంది అత్యంత సున్నితత్వానికి సౌకుమారానికి ప్రతీకలైన స్త్రీలు తనను చంపేందుకు అవకాశం లేదు అని ఆ రాక్షసి భావించాడు అతను రాక్షసుడు కాబట్టి అతని అసుర ప్రవృత్తిని వదులుకోలేదు వరం లభించిన తర్వాత అతని అహంకారం ఎంతగానో పెరిగిపోయింది ఎన్నో దారుణాలు చేయడం మొదలు పెట్టాడు ఎంతో మంది బ్రాహ్మణులను ఋషులను మహర్షులను కూడా అతను హింసించడం మొదలు పెట్టాడు స్వర్గాన్ని కూడా జయించడానికి ఆ రాక్షసుడు సిద్ధమయ్యాడు దేవతలందరూ కలిసి అతని మీద
యుద్ధం కూడా చేశారు కానీ ఫలితం లేదు వాళ్ళందరూ అతని చేతిలో ఓడిపోయారు కేవలం ఒక మహిళ మాత్రమే ఈ దారుక రాక్షసుడిని చంపగలదు అని బ్రహ్మ దేవుడు దేవతలందరికీ చెప్పాడు అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్లారు వాళ్ళందరూ ఆయనను ఆ రాక్షసుడి భార్య నుండి తమను రక్షించమని వేడుకున్నారు మానవ కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడు తన పార్వతీ దేవి వైపు చూశారు ఆ రాక్షసుడి భార్య నుండి అందరినీ రక్షించమని పార్వతీ మాతను పరమేశ్వరుడు అడిగారు కేవలం పార్వతీ దేవి మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలదు వెంటనే పార్వతీ దేవి నవ్వుతూ తన శరీరంలో
ఉన్న ఒక అంశాన్ని పరమేశ్వరుడిలో ఏకం చేసింది పార్వతీ దేవి శరీరం నుండి వచ్చిన అంశం పరమేశ్వరుడితో ఏకమైన తర్వాత ఆయన గొంతులో నుండి అవతరించింది అదే సమయంలో ఈశ్వరుడు త్రినేత్రాన్ని తెరిచాడు అప్పుడే కాళికాదేవి జన్మించింది నల్లటి రూపం కలిగిన కాళికాదేవి చూడడానికి అత్యంత భయానకంగా కనిపిస్తూ ఉంటుంది కాళికాదేవి రూపాన్ని చూసిన రాక్షసులతో పాటు దేవతలు కూడా అక్కడి నుండి పారిపోవడం మొదలు పెట్టారు ఆమె రూపం ఎంత భయానకంగా ఉంది అంటే ఆమె ముందు నిలబడడం ఎవ్వరికీ చేత కాలేదు ఇలా కాళికా దేవి ఎంతో మంది రాక్షసులను సంహరించింది మహిషాసుర ధూమ్రువిలోం శంభు
నిశంభు వంటి ఎంతో మంది రాక్షసులను దేవి చంపేసింది వీళ్ళందరికంటే కూడా అత్యంత బలాన్ని కలిగిన రాక్షసుడు రక్త బీజుడు అతనిని చంపడం దేవతలకు కూడా సాధ్యం కాదు రక్త బీజుడు అంటే రక్తం నుండి సృష్టింపబడే ఒక విత్తనం ఈ రాక్షసుడు ఎంతో కఠోరమైన తపస్సు చేసి శివుడి నుండి ఒక వరాన్ని సంపాదించుకున్నాడు ఈ రక్త బీజుని గాయపరిచిన వెంటనే అతని రక్తం నుండి మరొక రక్త బీజుడు పుట్టుకొని వస్తాడు దాంతో తనకు ఎదురు లేదు అనుకుని ఆ రాక్షసుడికి అహంకారం పెరిగిపోయింది గర్వంతో విర్రవీగిన రాక్షసుడు దేవతలను కూడా పీడించడం మొదలు పెట్టాడు దేవతలందరూ అతనితో ఎన్నో యుద్ధాలు
చేశారు కానీ అతని రక్తం పడిన చోట నుండి మరొక రక్త బీజుడు పుట్టుకు రావడం మొదలు పెట్టాడు ఇలా అతనికి మరణం అనేదే లేకుండా పోయింది రక్త బీజుని ఓడించేందుకు దేవతలకు ఎలాంటి మార్గం లేదు దేవతలందరూ దుర్గాదేవి దగ్గరకు వెళ్లి రక్తబీజుడిని సంహరించమని అడిగారు వెంటనే దుర్గాదేవి కాళికా అవతారాన్ని ధరించి ఆ రాక్షసుడిని చంపేసింది ఆ రాక్షసుడిని కాళికాదేవి చంపిన విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ రాక్షసుడి మీద కాళికాదేవి దాడి చేసిన వెంటనే అతని రక్తం కారడం మొదలైంది దాంతో కాళికాదేవి తన నాలుకని పొడవుగా చాచి అతని రక్తాన్ని కింద పడకుండా తన నాలిక మీదకు
తీసుకుంది ఈ విధంగా కాళికాదేవి రక్త బీజుని తెలివిగా చంపేసింది రక్త బీజుని చంపిన తర్వాత కాళికా దేవి ఉగ్ర స్వరూపం ధరించింది ఆమెను శాంతింప చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు ఆ రూపం కారణంగా ముల్లోకాలు అదిరిపడ్డాయి ఆమెకు భయపడి సమస్త జీవకోటి అల్లకల్లోలంగా మారిపోయింది వెంటనే దేవతలందరూ భయపడి శివుడి దగ్గరకు వెళ్లి తమను రక్షించమని వేడుకున్నారు అయితే శివుడు కూడా కాళికా దేవిని శాంతింప చేయలేకపోయాడు దాంతో ఆయన కాళికాదేవి పాదాల చెంతకు చేరుకున్నారు తన కాళ్ళ కిందకు వచ్చిన తన భర్తను చూసిన కాళికాదేవి ఒక్కసారిగా శాంతించింది ఈ విధంగా శివుడు
దేవతలకు సహాయం చేస్తూనే కాళికాదేవి కోపాన్ని కూడా తగ్గించాడు కాళికాదేవి రూపాన్ని మీరు చూసే ఉంటారు ఒక కాలు శివుడి మీద పెట్టి ఉన్న రూపాన్ని గమనించినట్లయితే కాళికాదేవి నల్లటి నలుపు రంగులో ఉంటుంది దేవతలందరికంటే ఎంతో విచిత్రంగా ఉన్న రూపం కాళికా దేవిది ఒక చేతిలో కత్తి మరో చేతిలో రాక్షసుడి తలను పట్టుకున్న కాళికాదేవి స్వరూపం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది ఆ రాక్షసుడు మరెవరో కాదు రక్త బీజుడు రక్తబీజుడి రక్తం దుష్ప్రభావం చూపడంతో కాలి కరాల నృత్యం చేయడం ప్రారంభించింది భూమిపై ఆమె ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది దేవతలంతా కలిసి
వెళ్లి శివుడిని వేడుకుంటారు కాలిని శాంతింప చేయడానికి యుద్ధ భూమికి వచ్చిన శివుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించిన ఆవేశం చల్లారదు రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తుంటుంది కాలి ఆమె కొప్పుముడి తొలగి కేసరాశిగా మారుతుంది ఆమె కేశాల నుంచి వెలువడే గాలి దేవతలను దూరానికి విసిరేస్తూ ఉంటుంది అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు ఎప్పటికీ కాలి శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గరకు చేరుతాడు అప్పటికి స్పృహలోకి వచ్చిన కాలి తన పాదాల దగ్గర ఉన్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకొని కొద్దిసేపటికి శాంతిస్తుంది అలా శివుడు
పాదాల చెంతకు చేరితే కానీ అమ్మవారి ఉగ్ర రూపం చల్లారలేదు సాధారణంగా భార్యల కాళ్ళ దగ్గర కూర్చున్న దేవుళ్ళు తక్కువ రాధాకృష్ణ సాంప్రదాయంలో రాధ పాదాల దగ్గర కృష్ణుడు కూర్చుని పాద సేవ చేసే విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి సత్యభామ అలంకరణ కోసం కూడా శ్రీకృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అలాంటిదే కాళికాదేవి శివుడి రూపం కాళికాదేవి కాళ్ళ కింద శివుడు పడుకొని ఉంటాడు కాళికాదేవి రూపం గురించి మనం చర్చించుకున్నట్లయితే ఆమె మెడలో 50 కపాలాల దండ ఉంటుంది చేతితో తయారు చేసిన వస్త్రాన్ని ధరించిన కాళికాదేవి నాలుకను బయట పెట్టిన రూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది
ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి ఆమె శరీరం అంతటా రక్తం నిండుగా ఉంటుంది ఆమె ముఖంలో మూడు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఒకటి సూర్యుడు మరొకటి చంద్రుడు మూడవది అగ్నికి ప్రతిరూపం కాళికాదేవి నుదుటి మీద చంద్రుడి రూపం కూడా మనకి కనిపిస్తుంది చెదిరిన జుట్టుతో కాళికాదేవి రూపం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది దుర్గాదేవి దశమహావిద్యలలో ఒకటి ఈ కాళికా స్వరూపం అని కూడా చాలా మంది పండితులు చెబుతూ ఉంటారు ఎవరైతే రాక్షస స్వభావాన్ని కలిగి దయా దాక్షిణ్యాలు మర్చిపోతారో అటువంటి వారిని సంహరించడానికి కాళికా రూపంలో దుర్గాదేవి జన్మించింది చెడు మీద మంచి చేసే యుద్ధమే
కాళికా రూపం మంచి వాళ్లకు శుభ ఫలితాలను చెడ్డవాళ్ళకు దుష్ఫలితాలను అందిస్తుంది కాళికా దేవతను మృత్యు దేవత అని కూడా పిలుస్తారు ఆమెకు ఉన్న శక్తులు చూసి కలిపురుషుడు కూడా భయపడుతూ ఉంటాడు సమస్త విశ్వంలో ఉన్న శక్తులన్నీ కలిసి కూడా ఆమెను శాంతింప చేయడం కష్టం కాళికా దేవిని ఎక్కువగా బెంగాల్ లో అస్సాంలో పూజిస్తూ ఉంటారు కాళికా దేవి సేవలో ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి ఉజ్జైని మహాకాళి దేవాలయం కోల్కత్తాలోని కాళికా దేవి దేవాలయం దక్షిణేశ్వర్ కాళికా దేవి ఆలయం కోల్కత్తాలోని కాళి ఘాట్ వంటి దేవాలయాలలో మనకి కాళికా మాత అనుగ్రహిస్తూ ఉంది